గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 01:16:05

నాని కథానాయకుడిగా ‘టక్‌ జగదీష్‌'

నాని కథానాయకుడిగా ‘టక్‌ జగదీష్‌'

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌'. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకుడు.  సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.  రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్‌ కథానాయికలు.  లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ తిరిగి మొదలైంది. ప్రస్తుతం నైట్‌ ఎఫెక్ట్‌లో వరి పొలాల మధ్య నానితో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.  ‘జగదీష్‌ జాయిన్స్‌ టక్‌ బిగిన్స్‌' అంటూ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభమైన విషయాన్ని నాని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టక్‌ చేసి వెనక్కి తిరిగి ఉన్న తన ఫొటోను పోస్ట్‌ చేశారు. కుటుంబ విలువలకు భావోద్వేగాలు, వినోదాన్ని జోడించి శివనిర్వాణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  జగపతిబాబు, రావురమేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, సినిమాటోగ్రఫీ:ప్రసాద్‌ మూరెళ్ల. 


logo