శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 11:38:04

బ్యాట్‌మెన్‌గా తైమూర్‌, బ్యాట్‌గార్ల్‌గా ఇనాయ‌

బ్యాట్‌మెన్‌గా తైమూర్‌, బ్యాట్‌గార్ల్‌గా ఇనాయ‌

క‌రీనా క‌పూర్ ముద్దుల త‌న‌యుడు తైమూర్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ గారాల ప‌ట్టి ఇనాయ నెటిజ‌న్స్‌కి చాలా సుపరిచితం. అప్పుడప్పుడు వీరిద్ద‌రి ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. శ‌నివారం సోహ అలీ ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తైమూర్, ఇనాయ‌కి సంబంధించి ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ఆఫీసులో నిశ్శ‌బ్ధ‌మైన రోజు అని క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఫోటోలో తైమూర్ అలీ ఖాన్‌కి బ్యాట్‌మెన్ అవ‌తారంలో క‌నిపిస్తుండ‌గా, ఇనాయ బ్యాట్‌గార్ల్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. వీరిద్ద‌రి ఫోటోల‌కి నెటిజ‌న్స్ ల‌వ్‌లీ కామెంట్స్ పెడుతున్నారు . ప్ర‌స్తుతం సైఫ్ ఇంట్లో సోహా అలీ ఖాన్ ఫ్యామిలీ ఉంటుండ‌గా, లాక్ డౌన్ స‌మ‌యం నుండి వీరు త‌మ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం సైఫ్, కరీనా, తైమూర్‌లు బీచ్ ప్రాంతానికి వెళ్లి స‌ర‌దా స‌మ‌యం గ‌డిపిన విష‌యం తెలిసిందే


logo