సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 18, 2021 , 08:38:20

మ‌రో సెల‌బ్రిటీ అకౌంట్ హ్యాక్..!

మ‌రో సెల‌బ్రిటీ అకౌంట్ హ్యాక్..!

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్స్ వ‌రుస‌గా హ్యాక్ అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  బాలీవుడ్ న‌టి ఇషా డియోల్, అమీషా ప‌టేల్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, మంచు మనోజ్, లాస్య ఇలా చాలా మంది సెల‌బ్రిటీల అకౌంట్స్ హ్యాక్ కాగా, ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ న‌టి టబు చేరింది. నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది. అందులో కనిపించే మెసేజ్‌లను, పోస్ట్‌లను పట్టించుకోవద్దు’’ అంటూ  పేర్కొంది. ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రించిన ట‌బు రీసెంట్‌గా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ట‌బు చాన్నాళ్ళ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే స‌రికి ఆమెను చూసిన అభిమానులు ముగ్దులయ్యారు. 90ల కాలంలో హీరోయిన్‌గా అల‌రించిన ట‌బు ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది.

VIDEOS

logo