శనివారం 04 జూలై 2020
Cinema - Apr 08, 2020 , 19:02:43

సొట్టబుగ్గల సుందరి తాప్పీ క్వారంటైన్‌ ఫొటోషూట్‌ చూశారా?

సొట్టబుగ్గల సుందరి తాప్పీ క్వారంటైన్‌ ఫొటోషూట్‌ చూశారా?

సెల‌బ్రిటీలు లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లోనే ఉన్నా అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. సోష‌ల్‌మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు వాళ్లు ఏంచేస్తున్నారో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. ఒక‌రు రెసిపీలు చేస్తున్నా అంటే మ‌రొక‌రు గిన్నెలు తోముతున్నానంటున్నారు. వ‌ర్కౌట్స్ చేస్తున్న‌ప్పుడు కొంద‌రు, డ్యాన్స్ చేస్తూ మ‌రికొంద‌రు ఇలా ఎవ‌రికి తోచిన విధంగా వారు ఏదో ఒకటి చేస్తూ వీడియో, ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.  సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ప‌న్ను మాత్రం అందరికీ భిన్నమైన పని చేసింది. ఎవ‌రో అడిగిన‌ట్లున్నారు. వెంట‌నే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్వారెంటైన్ ఫొటోషూట్ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది.


ఈ ఫొటో చూస్తే మొత్తం అర్త‌మైపోతుంది. తాప్సీ చిన్న‌నాటి ఫొటోల‌న్నింటినీ వ‌రుస‌గా గోడ‌కు అంటించింది. న‌ల్ల‌ని హీల్స్‌ను ట్రేలో పెట్టింది. బెడ్‌పైన‌ రివ‌ర్స్‌లో ప‌డుకొని, న‌ల్ల‌ని సాక్సులు ధ‌రించిన కాళ్ల‌ను గోడ‌ని అనిచ్చింది. పైగా బుక్ చ‌దువుతున్న‌ట్లు ఫోజ్ కూడా ఇచ్చింది. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో చిన్న జుట్టుగా క‌త్తిరించి లీవ్ చేసుకున్న‌ది. ఈ ర‌కంగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. క్వారెంటైన్‌లో చేస్తున్న ప‌నుల‌న్నీ స్కూల్‌డేస్‌ను గుర్తుచేస్తున్నాయ‌ని చెప్పుకొచ్చింది తాప్సీ.


logo