మంగళవారం 07 జూలై 2020
Cinema - May 30, 2020 , 17:14:47

తాప్సీ ఇంట్లో విషాదం

తాప్సీ ఇంట్లో విషాదం

గురుద్వారా: తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమున్న నటి తాప్సీ. ఈ మద్య కాలంలో తాప్సీ బాలివుడ్‌లోనూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. కాగా తాప్సీ ఇంట్లో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తాప్సీ వాళ్ళ బామ్మ ఈ రోజు తుది శ్వాస విడిచారు. తాప్సీ ఈ విషయాన్ని తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ వేధికగా పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక చిత్రాన్ని ఉంచి కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెలతారు అని రాసింది. ఇక తన బామ్మ మరణంకు సంబందించిన ఇతర ఏ వివరాలను తాప్సీ అభిమానులకు పంచుకోలేదు. 


logo