బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 13:10:28

మాల్దీవుల‌లో మస్త్ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ

మాల్దీవుల‌లో మస్త్ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ

క‌రోనా మహ‌మ్మారి వ‌ల‌న దాదాపు ఆరు నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కొంద‌రు షూటింగ్స్‌లో పాల్గొంటుండ‌గా, మ‌రి కొంద‌రు టూర్స్‌కు వెళుతున్నారు. ఢిల్లీ బ్యూటీ తాప్సీ.. విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టిస్తోన్న  త‌మిళ చిత్రం షూటింగ్ కోసం ఇటీవ‌లే జైపూర్ వెళ్లింది. ఆ సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే అక్కడి నుండి మాల్దీవుల‌కు చెక్కేసింది. 

 మాల్దీవుల‌లో త‌న సోద‌రి శ‌గున్, ఈవానియాల‌తో పాటు బాయ్ ఫ్రెండ్ మ‌తియాస్ బోయేతో తాప్సీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. త‌మ గ్యాంగ్‌తో ఈ అమ్మ‌డు చేసే సంద‌డికి సంబంధించిన ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్స్‌కు కావల‌సినంత వినోదాన్ని అందిస్తుంది. తాజాగా ఈ పింక్ బ్యూటీ బిగ్గిని షూట్ వీడియో చేసి దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తాప్సీ వీడియోకి వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ‌, భూమి ప‌డ్నేక‌ర్ ఫ‌న్నీ కామెంట్స్  పెట్టారు. ఇక తాప్సీ సినిమాల విష‌యానికి వ‌స్తే భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు ర‌ష్మీ రాకెట్‌, లూప్ ల‌పేటా అనే చిత్రాల‌లో న‌టిస్తుంది. 



logo