ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 14:52:24

ఫాల్తు హీరోయిన్ అంటూ తాప్సీపై ట్రోల్స్

ఫాల్తు హీరోయిన్ అంటూ తాప్సీపై ట్రోల్స్

చూడ‌చ‌క్కని అందం, ఆకట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టి తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా ఆఫ‌ర్స్ రావ‌డంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. త‌న న‌ట‌న‌తో మిలియ‌న్ ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు పొందింది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తాప్సీ త‌న సినిమాల విష‌యాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆమెపై ప‌లు ట్రోల్స్ కూడా జ‌రుగుతుంటాయి. వీటిని త‌న‌దైన శైలిలో తిప్పికొడుతుంటుంది తాప్సీ.

ప్ర‌స్తుతం తాప్సీ.. ర‌ష్మీ రాకెట్ అనే చిత్రం చేస్తుంది. ఇందులో అథ్లెట్‌గా క‌నిపించ‌నున్న ఈ అమ్మ‌డు పాత్ర‌కి సంబంధించి ప‌లు క‌స‌ర‌త్తులు చేస్తుంది. అథ్లెట్ దుస్తులు ధ‌రించి తాప్సీ చేస్తున్న వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్స్ కొంద‌రు ఆమెపై ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు . ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్ పొట్టి దుస్తులు ధ‌రించి గ్లామ‌ర్ షో చేస్తున్నావు త‌ప్ప నీలో అంత వెరైటీ ఏమిఒ లేదు, ఫాల్తు హీరోయిన్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి త‌న‌దైన శైలిలో స్పందించిన తాప్సీ.. చూపించడం అంటే ఏంటి?  నేను నా ప్ర‌తిభ‌ను చూపించాను, కాని అది నీకు క‌నిపించ‌దు అంటూ ట్రోల‌ర్స్‌కు గ‌ట్టిగా బుద్ది చెప్పింది.  తాప్సీ తెగువ‌ను ప‌లువురు నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు. 


logo