సోమవారం 01 జూన్ 2020
Cinema - May 11, 2020 , 16:37:02

త‌న బాయ్ ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసిన తాప్సీ

త‌న బాయ్ ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసిన తాప్సీ

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయ‌మైన అందాల న‌టి తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి అంత స‌క్సెస్‌లు లేక‌పోయిన హిందీలో మాత్రం భారీ విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇక  తాప్సీ ప్రేమ‌లో ఉంద‌ని  కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న‌ప్ప‌టికీ, ఏ రోజు దానిపై నోరు విప్ప‌లేదు . కాని తాజాగా త‌న బాయ్‌ఫ్రెండ్‌ని కుటుంబ స‌భ్యుల‌కి ప‌రిచ‌యం చేసి వాళ్ళు ఓకే చెప్పాక ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది.

తాప్సీ ఇన్నాళ్ళు ప్రేమ‌లో ఉంది  బ్యాడ్మింట‌న్‌‌ ఆటగాడైన మాథియాస్ బోతో. త‌న ప్రేమ‌ని త‌ల్లిదండ్రులు అంగీక‌రించినందుకే అంద‌రికి చెప్ప‌గ‌లుగుతున్నాయి. లేదంటే ఇప్ప‌టికీ మౌనంగా ఉండాల్సి వ‌చ్చేది. ఇన్నాళ్లు నా ప్రేమ‌ని దాచ‌డానికి కార‌ణం న‌టిగా నాకంటూ ప్ర‌త్యేక గుర్తింపు రావాల‌నుకోవ‌డం. ముందే చెప్పుంటే గ‌త ఏడాది సాధించిన విజ‌యాలు నాకు ద‌క్కేవి కావేమో. ఇక నేను ఎవ‌రితోనో రిలేష‌న్‌లో ఉన్నాన‌నే విష‌యం నా కుటుంబానికి తెలుసు. నా త‌ల్లిదండ్రులు, సోద‌రీమ‌ణులు ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తిని నేను అంగీక‌రించ‌లేను అని తాప్సీ చెప్పుకొచ్చింది. అయితే బో అనే వ్యక్తి తాప్సీకి ఆమె సోద‌రి ష‌గున్ ద్వారా ప‌రిచ‌యం అయ్యాడు 




logo