భవిష్యత్తును మార్చింది

కెరీర్ ఆరంభంలో గ్లామర్ నాయికగా ముద్ర పడ్డ పంజాబీ సొగసరి తాప్సీ.. ప్రస్తుతం ప్రయోగాత్మక ఇతివృత్తాలతో బాలీవుడ్లో సత్తాచాటుతోంది. ఆమె అతిథి పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘బేబీ’ శనివారంతో ఆరేళ్లుపూర్తిచేసుకుంది. వినూత్న కథల్ని ఎంచుకునే విషయంలో ఈ సినిమా తనకు మార్గదర్శనం చేసిందని తాప్సీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. చిన్న పాత్ర చేసినా దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుందో ఈ సినిమా నిరూపించిందని పేర్కొంది. ‘తెరపై మన పాత్ర నిడివి కంటే అది ప్రేక్షకులపై చూపించే ప్రభావమే చాలా ముఖ్యమని ఈ సినిమాతో అర్థమైంది. ‘బేబీ’లో ఏడు నిమిషాలు మాత్రమే కనిపించినా.. ఆ పాత్ర నా సినీ గమనాన్నే మార్చివేసింది. గొప్ప భవిష్యత్తును నిర్ధేశించింది’ అని తాప్సీ చెప్పింది. తాప్సీ పోస్ట్‌పై హీరో అక్షయ్‌కుమార్ స్పందించారు. తాప్సీ సినీ ప్రయాణం స్ఫూర్తివంతంగా కొనసాగుతోందని ఆయన ప్రశంసించారు. ‘బేబీ’ సినిమా లో తాప్సీ షబానాఖాన్ అనే పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
- బీజేపీని సవాల్ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీయే : కేజ్రీవాల్
- శ్రీవారికి పోస్కో భారీ విరాళం
- బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులు
- బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్
- బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయిన ప్రియా ప్రకాశ్.. వైరల్ వీడియో