బాలీవుడ్లో ప్రయోగాత్మక, వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తోంది పంజాబీ సొగసరి తాప్సీ. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆమె హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె జన్మదినోత్సవం సందర్భంగా సోషల్మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది తాప్సీ. గత ఏడాది కాలంగా ప్రతి రోజు అద్భుతంగా గడిచిపోతోందని ఆనందం వ్యక్తం చేసింది. ‘సినిమా రీలులా కాలం పరుగులు పెడుతోంది. వృత్తిపరమైన విజయాలు, ఆకాంక్షలు అన్నింటికంటే మీరందరూ అందించే ప్రేమే గొప్పగా అనిపిస్తోంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మరింతగా శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నా. మీ ప్రేమ నన్ను జీవనపథంలో నడిపిస్తోంది’ అంటూ తాప్సీ భావోద్వేగభరితంగా స్పందించింది. ప్రస్తుతం తాప్సీ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రంలో నటిస్తోంది. హిందీలో శభాష్ మితు, రష్మీ రాకెట్, డోబారా, లూప్లపేటా చిత్రాలతో బిజీగా ఉంది.