మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 10:03:43

ఫైన‌ల్ సెండ్ ఆఫ్ ఫోటో షేర్ చేసిన సుశాంత్ సోద‌రి

ఫైన‌ల్ సెండ్ ఆఫ్ ఫోటో షేర్ చేసిన సుశాంత్ సోద‌రి

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం అభిమానుల‌కి, ఫ్యామిలీకి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ఇటీవ‌ల పాట్నాలో సుశాంత్ సంస్మ‌ర‌ణ స‌భ ఏర్పాటు చేయ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ గుక్క‌ప‌ట్టి ఏడ్చారు. చేతికొచ్చిన త‌న‌యుడు ఇక లేర‌నే వార్త‌ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోయారు. తాజాగా పాట్నాలోని ఇంట్లో సుశాంత్‌కి ఫైన‌ల్ సెండ్ ఆఫ్ ఇచ్చారు ఆయ‌న కుటుంబ స‌భ్యులు.

కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో చిన్న‌పాటి ప్రార్ధ‌నా స‌మావేశం ఏర్పాటు చేయ‌గా, అందుకు సంబంధించిన ఫోటోని సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ కీర్తి త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. నువ్వు ఎక్క‌డ ఉన్నా సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాం అని పోస్ట్‌కి కామెంట్ రూపంలో పెట్టింది శ్వేతా. కాగా, సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో ఒక్కసారిగా వాతావ‌ర‌ణం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. నెపోటిజం వ‌ల‌న‌నే ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని ప‌లువురు త‌మ వాద‌న‌లు వినిపించారు 


logo