శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 09:42:12

55 రోజుల జ‌ర్నీని చూపించిన బిగ్ బాస్..ఎమోష‌న‌ల్ అయిన హౌజ్‌మేట్స్

55 రోజుల జ‌ర్నీని చూపించిన బిగ్ బాస్..ఎమోష‌న‌ల్ అయిన హౌజ్‌మేట్స్

నాగార్జున హోస్ట్‌గా ప్రారంభ‌మైన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 చూస్తుండ‌గానే 55 రోజులు పూర్తి చేసుకుంది. 15 మంది స‌భ్యుల‌తో ప్రారంభ‌మైన ఈ రియాలిటీ షోకు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం 18 మంది స‌భ్యుల‌తో బిగ్ బాస్ సీజన్ 4  రంజుగా సాగుతూ వ‌చ్చింది. తొలి వారం హౌజ్ నుండి సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ కాగా, త‌ర్వాత కరాటే క‌ళ్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్, జోర్ధార్ సుజాత, కుమార్ సాయి, దివి బిగ్ బాస్ హౌజ్‌ని వీడారు. అనారోగ్యం కార‌ణంగా గంగ‌వ్వ నిష్క్ర‌మించ‌గా, నోయ‌ల్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. 

55 రోజుల పాటు సాగిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4ని నాగార్జున , స‌మంత హోస్ట్ చేశారు. నాగ్ గైర్హాజ‌రు కార‌ణంగా స‌మంత ద‌స‌రా స్పెష‌ల్ ఎపిసోడ్‌ని హోస్ట్ చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే శుక్ర‌వారం ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌కు ఇన్ని రోజుల జ‌ర్నీని చూపించారు బిగ్ బాస్‌. ఇందులో  ప్రేమ‌లు, అల‌క‌లు, గొడ‌వ‌లు, చిలిపి ప‌నులు ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయి. అఖిల్, మోనాల్ కెమిస్ట్రీ, అభిజిత్‌- మోనాల్ మ‌ధ్య జ‌రిగిన స‌న్నివేశాల‌ని ఎక్కువ‌గా చూపించారు.

బిగ్ బాస్ షోలో ర‌స‌వ‌త్త‌రంగా సాగిన ఈ స‌న్నివేశాల‌ని చూసే స‌రికి హౌజ్‌మేట్స్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. మొన్న‌టి వ‌ర‌కు బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న అఖిల్‌, అభిజిత్‌లు హ‌గ్ చేసుకొని ఫ్రెండ్స్ అయ్యారు. అద్భుత‌మైన జ‌ర్నీని చూపించిన బిగ్ బాస్ కు హౌజ్‌మేట్స్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డంతో హోస్ట్‌తో ఇంటి స‌భ్యుల సంద‌డి ఉంటుంది. మ‌రి మ‌నాలి షెడ్యూల్‌తో నాగార్జున బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఎవ‌రు హోస్ట్‌గా వ‌స్తార‌నేది స‌స్పెన్స్‌గా మారింది.