సోమవారం 01 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 08:36:31

స్వాతిలో ముత్య‌మంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో

స్వాతిలో ముత్య‌మంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో

మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి న‌రేష్ ప్ర‌స్తుతం బంగారు బుల్లోడు అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 1983లో ఇదే టైటిల్‌తో బాలకృష్ణ, రమ్య కృష్ణ రవీనా టాండన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ర‌విరాజా పినిశెట్టి  చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. రాజ్‌-కోటి సంగీత సార‌థ్యంలో రూపొందిన  స్వాతిలో ముత్యమంత సాంగ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ సాంగ్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్‌ని అల్ల‌రి న‌రేష్ త‌న తాజా చిత్రం కోసం రీమిక్స్ చేశాడు.

అల్ల‌రి న‌రేష్‌, పూజా జ‌వేరి ఈ పాట‌కు ఆడిపాడ‌గా, తాజాగా ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు.  సాయి కార్తీక్ సంగీతం .. రేవంత్, న‌డ‌ప్రియ ఆల‌పించిన తీరు బాగుంది. లేటెస్ట్ సాంగ్ కూడా శ్రోతల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మ‌రి కొద్ది రోజులలో విడుద‌ల కానుంది. 

 

VIDEOS

logo