బెల్లంకొండ సురేష్ నిర్మాతగా టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు . ప్రస్తుతం ‘ఛత్రపతి’ సినిమాను ఆయన బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్లో వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ తనయుడు, శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాతో డెబ్యూ ఇస్తున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుండగా.. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు సూర్య డీఓపీగా వ్యవహరించనున్నారు.
కొద్ది సేపటి క్రితం చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.మూవీకి స్వాతి ముత్యం అనే టైటిల్‌ని కన్ఫాం చేస్తూ విడుదల చేసిన పోస్టర్లో గణేష్ కూల్‌గా కనిపిస్తున్నాడు. ఇందులోబాల మురళిగా కనిపించనున్నాడు గణేష్. చూస్తుంటే తొలి సినిమాతోనే మనోడు హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే గణేష్.. పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం, తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో ఆయన దర్శకునిగా పరిచయం అవుతున్నారు.