మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 09:14:53

మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఫిదా చేసేందుకు అబ్బాయిల ప్ర‌య‌త్నం

మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఫిదా చేసేందుకు అబ్బాయిల ప్ర‌య‌త్నం

16 మంది స‌భ్యుల‌తో మొద‌లైన బిగ్ బాస్ షోలో ఇప్ప‌టికే కుమార్ సాయి, అవినాష్ రూపంలో ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి  పంపారు. ఫేస్‌ను క‌వ‌ర్ చేసుకొని ఇంట్లోకి వ‌చ్చిన ఆమెతో అంద‌రు క‌లిసి డ్యాన్స్ చేశారు. ఆ త‌ర్వాత ఆమె ముఖానికి ఉన్న మాస్క్‌ను రాజ‌శేఖ‌ర్ తీసేసారు. తాను స్వాతి దీక్షిత్ అంటూ అంద‌రిని ప‌రిచ‌యం చేసుకుంది.

బిగ్ బాస్.. ఇంట్లో ఉన్న అబ్బాయిలంద‌రికి ఓ విష‌యం చెప్పారు. స్వాతి మీ అంద‌రి కోసం ఓ స‌ర్‌ప్రైజ్ తెచ్చింది. ఆమెను ఎవ‌రైతే ఇంప్రెస్ చేస్తారో వారికి ఆ స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని అన్నారు. ఇక స్వాతిని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్‌, అభి, నోయ‌ల్ పాట‌లు పాడ‌గా మెహ‌బూబ్..100 డిప్స్ నాన్‌స్టాప్‌గా కొట్టాడు. ఇక అవినాష్ ఆమెను కొంత న‌వ్వించాడు. రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ ఆమె గురించి అద్భుతంగా చెప్పి ఫిదా అయ్యేలా చేశాడు.

అయితే స్వాతి మాత్రం  అఖిల్, అవినాష్, రాజశేఖర్ మాస్టర్, నోయల్‌లకు ఇంప్రెస్ అయినట్టు చెప్పి  వాళ్లకి రెడ్ రోజ్‌లు అందించింది.  అంతేకాదు ఈ న‌లుగురితో స్వాతి  పార్టీని ఎంజాయ్ చేసింది. ఇక స‌ప‌రేట్ రూంలో ఉన్న అఖిల్‌కు మోనాల్ తినిపిస్తూ, అమ్మాయి ఎలా ఉందంటూ ఆరాలు తీసింది. దీనికి మ‌నోడు బాగుంది, మంచిగా ఆడుతుంది, పాడుతుంది అని చెప్పుకొచ్చాడు.  ఆ త‌ర్వాత అభిజిత్‌.. స్వాతితో పులిహోర క‌లిపే ప్ర‌య‌త్నం చేశాడు.దీనిపై  అవినాష్, గంగవ్వ, లాస్య, నోయల్‌, రాజశేఖర్ మాస్టర్‌, సుజాతలు తెగ నవ్వుకుని గుసగుసలాడారు. ఇక నేడు శ‌నివారం కావ‌డంతో నాగ్ తో పాటు  ఇంటి స‌భ్యులు తెగ సంద‌డి చేయ‌నున్నారు. 


logo