సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 10:07:25

బుల్లెట్ దింపిన బిగ్ బాస్.. తొలివారంలోనే ఎలిమినేట్

బుల్లెట్ దింపిన బిగ్ బాస్.. తొలివారంలోనే ఎలిమినేట్

బిగ్ బాస్ సీజ‌న్ 4కి సంబంధించిన ఎపిసోడ్ 28లో త‌ప్పు చేసిన వారిని బోనులో నిలుచోపెట్టి ప్ర‌శ్నిస్తున్నారు. మోనాల్ ఛాన్స్ రాగానే, అభిని బోనులోకి పిలిచింది. కొద్ది రోజులుగా అభి మాట్లాడ‌డం లేద‌ని, క‌నీసం ఐ కాంటాక్ట్ కూడా లేద‌ని పేర్కొంది మోనాల్‌. దీనికి సంబంధించిన అభిజిత్‌.. నాకు  ఓ విష‌యంలో న‌చ్చ‌క దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్ద‌రి విష‌యంపై మాట్లాడిన దివి.. ఓ సారి  అభితో కలిసి స్టోర్ రూంలో  ముచ్చట్లు పెట్టిన మోనాల్‌, ఐ లైక్ యూ కూడా చెప్పింద‌ని ఇదే విష‌యాన్ని అభి మాతో చెప్పింద‌ని స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు అఖిల్ ప‌డుకున్న త‌ర్వాత మోనాల్‌.. అభితో క్లోజ్‌గా ఉంటుంద‌ని దివి అనే స‌రికి అఖిల్, మోనాల్ కంట క‌న్నీరు ఆగ‌లేదు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన మోనాల్ .. ఆరోజు బ్యాటరీస్ మార్చుకోవడానికి స్టోర్ రూంకి వెళ్లానని.. రేషన్ మేనేజర్‌గా అభి ఉండటం వల్ల అతనితో మాట్లాడాల్సి వచ్చిందని, ప‌ర్స‌న‌ల్ అత‌ను ఇష్టం ఉండ‌డం వ‌ల‌న ఐ లైక్ యూ అని చెప్పాను అంటూ మోనాల్ క్లారిటీ ఇచ్చింది. 

ఈ త‌తంగం మ‌ధ్య నాగార్జున .. అవినాష్‌ని తెగ ఆడేసుకున్నాడు. సోఫా మీద మాకు అర్ధం కాకుండా ఏదో రాస్తున్నావు ఏంటి అని అడ‌గ‌గా, ఏమో స‌ర్ గుర్తు లేదు అని అన్నాడు. అరియానాని అడ‌గ‌గా అదే స‌మాధానం ఇచ్చింది. సోఫా మీద రాస్తే మాకు తెలియ‌దు అనుకుంటున్నావా, బిగ్ బాస్ హౌజ్ మొత్తం కెమెరాస్ ఉన్నాయి. ఐ ల‌వ్ యూ అని రాసావు అని నాగార్జున అన‌గా, స‌ర్ అలా రాయ‌లేదు అని అన్నాడు అవినాష్‌. కూల్ అని రాసావు క‌దా అంటే అవున‌ని అరియానా, అవినాష్ అన్నారు. స‌ర్ పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇలా అని తెలిస్తే ఎవ‌రు పిల్ల‌ని కూడా ఇవ్వ‌రు అంటూ అవినాష్ అన్నాడు. ఇదంతా స‌ర‌దా కోస‌మే అని నాగ్ కూడా చెప్ప‌డంతో క‌థ ముగిసింది. 

ఇక ఎలిమినేష‌న్ టైం స‌మ‌యం రాగానే, నామినేష‌న్‌లో ఉన్న ఏడుగురు స‌భ్యులు హారిక‌, కుమార్ సాయి, సోహైల్‌, అభిజిత్, స్వాతి దీక్షిత్, మెహ‌బూబ్, లాస్య‌లు నిలుచున్నారు. వారికి గ‌న్ ఇచ్చి షూట్ చేయాల‌న్నారు. ఫ‌స్ట్ రౌండ్‌లో ఎవ‌రికి  గ‌న్ సౌండ్ రాలేదు. రెండో రౌండ్‌లో స్వాతి దీక్షిత్ షూట్ చేసినప్పుడు గ‌న్ సౌండ్ రావ‌డంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్టు నాగార్జున పేర్కొన్నారు. ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న‌వాళ్ళ‌ని సేవ్ చేయ‌కుండా డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేయ‌డంపై అంతా షాక్ అయ్యారు. వ‌చ్చిన తొలి వారంలోనే స్వాతి దీక్షిత్ ఇంటి బాట ప‌ట్ట‌డంతో నోయ‌ల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ రోజు ఎపిసోడ్‌లో స్వాతి .. బిగ్ బాస్ స్టేజ్‌పైకి రానుంది.

స్వాతిని రాజశేఖర్ మాస్ట‌ర్ నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఇక ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే నామినేష‌న్‌లో ఉన్న మిగిలిన ఇంటి స‌భ్యుల‌లో మ‌రొక‌రు కూడా ఎలిమినేట్ కానున్నార‌ట‌. ఇది కేవలం ఎలిమినేషన్ మాత్రమే , ఎవర్నీ సేవ్ చేయలేదని నాగార్జున చెప్ప‌డంతో రెండో ఎలిమినేష‌న్ కూడా ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి రెండో ఎలిమినేట‌ర్ ఎవ‌ర‌న్న‌ది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. 


logo