సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 08:45:51

మాస్ట‌ర్‌ని కెప్టెన్ టాస్క్ నుండి త‌ప్పించిన స్వాతి

మాస్ట‌ర్‌ని కెప్టెన్ టాస్క్ నుండి త‌ప్పించిన స్వాతి

బిగ్ బాస్ సీజ‌న్ 4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆమెని ఆదివారం నాటి 29వ ఎపిసోడ్‌లో  వేదికపైకి పిలిచారు నాగార్జున. స్టేజ్‌పైకి వ‌చ్చే వాళ్ళ‌తో ప్ర‌తీ సారి ఇంట్లో వాళ్ళ గురించి చెప్పించే నాగ్ ఈ సారి కూడా అదే పని చేశారు. బోర్డ్‌ల‌పై ఉన్న ల‌క్ష‌ణాల ఆధారంగా ఏది ఎవ‌రికి సెట్ అవుతుందో చెప్పాల‌ని స్వాతి దీక్షిత్‌కి చెప్పారు నాగార్జున .

ముందుగా  ‘నక్క తోక తొక్కిన వారు’ అనే ట్యాగ్‌ కుమార్ సాయికి సరిపోతుందని స్వాతి పేర్కొంది. మంచి టాలెంట్ కుమార్‌లో ఉంది, అత‌నికి పుష‌ప్ చేస్తేనే టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చింది. అనంత‌రం అమ్మ రాజశేఖర్‌కు నమ్మక ద్రోహి అనే ట్యాగ్ ఇవ్వ‌గా, పు కార్ల పుట్ట - జోర్దార్ సుజాత, సొహైల్ - దొంగ, లాస్య - అవకాశవాది, నోయల్ - గుడ్డిగా నమ్మేవారు, మెహబూబ్ - అనుసరించే వారు, మోనాల్ - ఏమార్చేవారు, అరియానా - ఓవర్ కాన్ఫిడెన్స్, హారిక - ట్యూబ్‌ లైట్, అభిజిత్ - అహంకారి, గంగవ్వ - చాడీల చిట్టా, అఖిల్ - గమ్యం లేని పక్షి అనే బోర్డ్‌ల‌ను వారి వారి మెడ‌లో వేయాల‌ని సూచించింది సాక్షి.

ఇక  వెళుతూ వెళుతూ అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై ఓ పెద్ద బిగ్ బాంబ్ వేసింది స్వాతి.న‌న్ను మాస్ట‌ర్ న‌మ్మ‌క ద్రోహం చేశారు. నువ్వు సేవ్ అయిపోతావ‌ని నామినేట్ చేసా అని చెప్పిన మాస్ట‌ర్, వెన‌క మ‌రో మాట మాట్లాడారు. నాకు వెన్ను పోటు పొడిచినందుకు అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన‌కూడ‌దంటూ బిగ్ బాంబ్ వేసింది. అంతేకాదు మాస్ట‌ర్ మీరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసేయండి ఇద్ద‌రం క‌లిసి ఎంజాయ్ చేద్దాం అని సెటైర్ వేసింది. దీనికి అమ్మ సైలెంట్‌గా ఉండిపోయారు. అనంతరం సండే ఫన్‌డే లో భాగంగా జంబ‌ల‌కిడి పంబని బిగ్ బాస్ లో చూపించారు. క‌బ‌డ్డీ ఆడించారు. చివ‌ర‌కు మ‌రో ఎలిమినేష‌న్ లేదని చెప్పి అందరిని సేవ్ చేశారు.  


logo