కరోనా మహమ్మారి ఎందరో జీవితాలని చిదిమేసింది. ఒకప్పుడు మంచిగా ఉన్నవాళ్లు కూడా ఇప్పడు పొట్టచేత పట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. సినీ ఇండస్ట్రీలో పని చేసే కొందరు నటీనటులు అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నారు. ఈ క్రమంలో బెంగాలీ నటుడు సువో చక్రబర్తి అవకాశాలు రాక,దాని వలన పలు ఆర్దిక ఇబ్బందులని ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తడంతో ఫేస్ బుక్ లైవ్‌లో సూసైడ్ చేసుకున్నాడు.
బెంగాలీలో ‘మంగళ్ చాంది’ మరియు ’మానస’ వంటి సీరియల్స్‌తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన సువో చక్రబర్తి జూన్ 8 అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ.. సడెన్‌గా నిద్ర మాత్రలు మింగాడు. ఇది చూసిన ఆయన ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన రక్షక భటులు అతన్ని హాస్పిటల్ చేర్చి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉంది. ఆగస్ట్ నుండి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుండగా, చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడినట్టు సువో చక్రబర్తి పేర్కొన్నారు.