మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 19:14:55

సుశాంత్ భ‌య్యాది ఖ‌చ్చితంగా హ‌త్యే: అంకిత్

సుశాంత్ భ‌య్యాది ఖ‌చ్చితంగా హ‌త్యే: అంకిత్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి కేసులో అనూహ్య ప‌రిణామాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసులో సుప్రీంకోర్టు సీబీఐ ద‌ర్యాప్తున‌కు అంగీక‌రించింది. మ‌రోవైపు ఈడీ అధికారుల ఎదుట రియా హాజ‌రైంది. ఇదిలా ఉంటే తాజాగా మ‌రో సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో దుమారం రేపుతున్నాయి. సుశాంత్ స‌న్నిహితుడు, వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌ అంకిత్ ఆచార్య దీన్ని హ‌త్య‌గా చెప్పుకొస్తున్నాడు.

సుశాంత్ భ‌య్యా గురించి నాకు బాగా తెలుసు. ఇది ఆత్మ‌హ‌త్య అంటే నేను న‌మ్మ‌ను. ఖ‌చ్చితంగా హత్యే. ఒక‌వేళ సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అనుకున్నా..మెడ‌పై యూ ఆకారంలో మార్క్ ఉండాలి. కానీ ఎవ‌రైనా కొట్టిన‌పుడు ఓ ఆకారంలో మార్క్స్ లు క‌నిపిస్తాయి. సుశాంత్ భ‌య్యా కేసులో ఓ ఆకారం గుర్తులే క‌నిపించాయి. ఒక‌వేళ ఆత్మ‌హ‌త్య అయితే క‌ళ్లు తేలేసిన‌ట్టుంటాయి. నాలుక బ‌య‌ట‌కొస్తుంది. నోటి నుంచి నుర‌గ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కానీ ఇలాంటి గుర్తులేవి సుశాంత్ శరీరంపై లేవు. కాబట్టి ఖచ్చితంగా హ‌త్యేన‌ని అంకిత్ ఆచార్య ఆరోపిస్తున్నాడు. సుశాంత్ పెంపుడు కుక్క బెల్టుతోనే దుర్మార్గులు అత‌న్ని కొట్టిచంపారని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ జ‌రిపించి..సుశాంత్ చంపిన వారికి ఉరిశిక్ష వేయాల‌ని డిమాండ్ చేశాడు. అంకిత్ చెప్తున్న విషయాలు ప‌లు ర‌కాల అనుమానాల‌కు తావిస్తున్నాయి. మ‌రి విచార‌ణ‌లో ఏం తెలుస్తోందో చూడాలి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo