గురువారం 28 మే 2020
Cinema - May 18, 2020 , 13:45:40

సుస్మితా సేన్ హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా ?

సుస్మితా సేన్ హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా ?

మాజీ ప్ర‌పంచ సుంద‌రి సుస్మితా సేన్ క్యాన్స‌ర్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కి క్యాన్స‌ర్‌ని జయించిన ఈ అమ్మ‌డు తాజాగా త‌న హెల్త్ సీక్రెట్స్‌ని వీడియో ద్వారా తెలియ‌జేసింది.  మ‌న శ‌రీరం గురించి మ‌న‌కంటే ఎక్కువ ఎవ‌రికి తెలియ‌దు. నుంచాకు ప్రాక్టీస్ వ‌ల‌న తాను మ‌ళ్లీ మాములు స్థితికి వ‌చ్చిన‌ట్టు పేర్కొంది సుస్మితా

2014 సెప్టెంబ‌ర్‌లో అడిస‌న్ వ్యాధితో బాధ‌ప‌డ్డ సుస్మితా సేన్ పూర్తిగా రోగ నిరోధ‌క శ‌క్తిని కోల్పోయింది. క‌నీసం వ్యాధితో పోరాడే శ‌క్తి కూడా త‌న‌కి లేద‌ట‌. కంటి చుట్టూ న‌ల్లటి వ‌ల‌యాలు, ఎన్నో స‌వాళ్ళు త‌న జీవితంలో వ‌చ్చాయి అంటుంది సోన‌మ్. ఆ చీక‌టి రోజులని త‌లచుకుంటూ బాధ‌ప‌డ్డ సుస్మితా సేన్ వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డటం కోసం ఎన్నో మెడిస‌న్స్ వాడింద‌ట. దాని వ‌ల‌న సైడ్ ఎఫెక్ట్స్ రావ‌డంతో పాటు జీవితం స‌మ‌స్య‌గా మారుతుందేమోన‌ని భ‌య‌ప‌డింద‌ట‌. అలాంటి సమ‌యంలో త‌న జీవితాన్ని రీబుల్డ్ చేసుకోవ‌డానికి నుంచాకు సాధ‌న చేసింది. దీని వ‌ల‌న 2019 నాటికి మాములు స్థితికి వ‌చ్చింది సుస్మితా. logo