ఇప్పటికే టాలీవుడ్లో సగం మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వారే కాగా, ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మరొకరు వెండితర ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఆమె ఎవరో కాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు, చరణ్ చిత్రాలకు వర్క్ చేశారు సుస్మిత. ఈ మధ్య తన భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సుస్మిత.. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.
ఇప్పుడు వెండితెరపై తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8 తొట్టకల్ అనే తమిళ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన సుస్మిత ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఈ మూవీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కాగా, దీనిని తెలుగులో ఓ యువ హీరోతో చేయనుందట సుస్మిత. కేసు విచారణలో పోలీసు తన రివాల్వర్ పోగొట్టుకోగా ఇది ఎన్నో పరిణామాలకు దారి తీస్తుంది. ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాలుగేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడలోను రీమేక్ కాగా, అక్కడ భారీ హిట్ కొట్టింది.
ఇవికూడా చదవండి..