బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 13:23:29

మొద‌లైన చిరు కూతురు వెబ్ సిరీస్

మొద‌లైన చిరు కూతురు వెబ్ సిరీస్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150, సైరా చిత్రాల‌కి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేసిన సుస్మిత ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి ఈ బేన‌ర్‌పై వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.  ముందుగా ఎక్స్ చేంజ్ ఆఫ్ ఫైర్ టైటిల్‌తో వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్ చేయ‌గా, షూటింగ్ కొద్ది సేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ హాజ‌ర‌య్యారు. పూజా కార్య‌క్ర‌మాల‌తో షూటింగ్ ప్రారంభించారు. 

ప్ర‌కాశ్ రాజ్, సంప‌త్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ని ఓయ్ ఫేం ఆనంద్ రంగా తెర‌కెక్కిస్తున్నారు. కాప్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. జీ5 యాప్‌లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంది. కాగా, మెగా ఫ్యామిలీలో  చిరంజీవి కుమారుడు చరణ్, నాగబాబు ఇప్పటికే నిర్మాత‌లుగా ప‌లు సినిమాలు తీయ‌గా , సుస్మిత కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం గమనార్హం.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo