మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 10:35:24

విడాకుల‌పై నోరు విప్పిన సుస్మితా సేన్ సోద‌రుడు

విడాకుల‌పై నోరు విప్పిన సుస్మితా సేన్ సోద‌రుడు

గ‌త ఏడాది జూన్‌లో గోవా వేదికగా పెళ్లి పీట‌లు ఎక్కిన రాజీవ్ సేన‌, చారు అపోసా కొద్ది కార‌ణాల వ‌ల‌న విడిపోయారంటూ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ సోద‌రుడు రాజీవ్ సేన్ స్పందించారు. నా భార్య‌తో విడాకులు తీసుకున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల వెనుక ఒక‌రు ఉన్నారు. ఆమె ద‌గ్గ‌రి వ్య‌క్తి  బ్రెయిన్ వాష్ చేసి మ‌మ్మ‌ల్ని విడ‌దీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. నా భార్య చాలా అమ‌యాకురాలు. వారి మాట‌లు చారు న‌మ్మ‌ద‌ని అనుకుంటున్నాను. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది తెలిసాక వారి పేరుతో పాటు ఫోటో కూడా బ‌య‌ట‌పెడ‌తాను అని రాజీవ్ పేర్కొన్నారు.

త‌న భార్య‌తో గొడ‌వ ప‌డి రాజీవ్ సేన్ ముంబై నుండి ఢిల్లీకి వెళ్లిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. ఇలాంటి వార్త‌ల‌కి నేను గ‌ట్టిగా న‌వ్వుతాను. నాకు ముంబై, ఢిల్లీ, దుబాయిలో ఇళ్ళు ఉన్నాయి. స‌మ‌యాన్ని బ‌ట్టి వెళుతుంటాను. ఇలాంటి రూమ‌ర్స్ పుట్టించే వారి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తానంటున్నాడు రాజీవ్. అయితే వీరిద్ద‌రు విడిపోయార‌ని వార్త‌లు పుట్ట‌డానికి అస‌లు కార‌ణం ఇద్ద‌రు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్ అన్ ఫాలో చేసుకోవ‌డంతో పాటు పెళ్లి ఫోటోలు డిలీట్ చేయ‌డం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo