బుధవారం 03 జూన్ 2020
Cinema - May 17, 2020 , 23:17:05

నాలోని బాధకు కళాత్మక రూపం

నాలోని బాధకు కళాత్మక రూపం

వారియర్‌ పేరుతో యూట్యూబ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ కళ నాన్‌చాక్‌ విన్యాసాల్ని స్వయంగా చేస్తున్న వీడియోను  బాలీవుడ్‌ నటి సుస్మితసేన్‌ పోస్ట్‌చేసింది. నాన్‌చాక్‌ విద్యలో సుస్మిత ప్రావీణ్యాన్ని, వేగాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అడిసన్‌ వ్యాధి నుంచి దూరమయ్యేందుకు నాన్‌చాక్‌ను నేర్చుకున్నట్లు సుస్మిత తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘ జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 2014 సెప్టెంబర్‌లో ఆటో ఇమ్యూన్‌ సమస్య తలెత్తింది. అడిసన్‌ వ్యాధి  ఉందని నిర్ధారణ అయ్యింది.  నా శరీరంలోని ప్రతికూల శక్తులతో పోరాడలేకపోయాను. జీవితం మొత్తం అంధకారంగా మారిపోయింది.  నాలుగేళ్లు  నిరాశ నిస్పృహలో మునిగిపోయాను.  వ్యాధిని ఎదుర్కోవడానికి స్టెరాయిడ్స్‌పై ఆధారపడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ మొదలయ్యాయి. ఈ సమస్యల నుంచి బయటపడి మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారు కావడానికి నాన్‌చాక్‌ను నేర్చుకోవడం ప్రారంభించాను.  అలా నాలోని ఆవేదన కళాత్మక రూపం తీసుకుంది. నాన్‌చాక్‌ వల్ల ఆటో ఇమ్యూనిటీ సమస్య తగ్గిపోయింది’ అంటూ సుస్మిత సేన్‌ తెలిపింది. logo