బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 11:36:54

స‌హ‌చ‌రుడి మృతికి సంతాపం ప్ర‌క‌టించిన సుశీల‌

స‌హ‌చ‌రుడి మృతికి సంతాపం ప్ర‌క‌టించిన సుశీల‌

16 భాష‌ల‌లో 40వేల‌కు పైగా పాట‌లు పాడిన స్వ‌ర జ్ఞాని ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణం ప్రతి ఒక్క‌రికి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. బాలుతో క‌లిసి ప‌ని చేసిన వారు ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. బాలుతో క‌ల‌సి ఎన్నో సినిమాల‌కు అద్భుత‌మైన పాట‌లు ఆల‌పించిన సుశీల ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. 

సంగీత ప్రపంచానికి ఎంతో మేలు చేసిన బాలుని మహమ్మారి  వెంటాడి వెంటాడి వేధించి తీసుకుపోయిందని సుశీల భావోద్వేగానికి గురయ్యారు. కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదంటూ ఆమె సంతాపం ప్రకటించారు.మనందరి ఆప్తుడిని తీసుకుపోయి ఒక పెద్ద అగాధంలోకి తోసేసిందన్నారు. ప్రపచవ్యాప్తంగా అభిమానులందర్నీ తీరని దుఃఖ సముద్రంలోముంచేసిందంటూ ఆమె కంటతడిపెట్టారు. గుండె ధైర్యం తెచ్చుకుని, విషాదంనుంచి కోలుకోవాలని, అభిమానులకు సూచించారు. 


logo