శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 16:05:11

షారుక్ తో సుశాంత్ డ్యాన్స్..వీడియో వైరల్

షారుక్ తో సుశాంత్ డ్యాన్స్..వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా ఎదిగి స్టార్ డమ్ సంపాదించిన షారుక్ అంటే సుశాంత్ కు చాలా ఇష్టం. టీవీ స్ర్కీన్ నుంచి సిల్వర్ స్ర్కీన్ పైకి ప్రయాణాన్ని సాగించిన సుశాంత్ మంచి డ్యాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2017లో ఓ టీవీ రియాలిటీ షోలో సుశాంత్ షారుక్ తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఛయ్య ఛయ్య  అంటూ సాగే సూపర్ హిట్ ట్రాక్ కు షారుక్, సుశాంత్ స్టేజీపై డ్యాన్స్ చేశారు. చాలా స్టైలిష్ గా సుశాంత్ డ్యాన్స్ చేస్తుంటే..పక్కనే ఉన్న ఫరాఖాన్, సానియామీర్జా వారిలో మరింత జోష్ నింపుతున్నారు.

స్టేజీ కిందున్న అభిమానులు కేకలు వేస్తూ ఇద్దరు హీరోల డ్యాన్స్ ను తెగ ఎంజాయ్ చేశారు. షారుక్ ఫ్యాన్స్ పేజీలో షేర్ చేసిన ఈ త్రోబ్యాక్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా బాంద్రా పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo