గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 02:20:29

గేర్‌ మార్చి బండి తియ్‌

గేర్‌ మార్చి బండి తియ్‌

సుశాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌' ఉపశీర్షిక. ఏ1స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌ పతాకాలపై రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు.  ఆదివారం దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సుశాంత్‌ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై దూసుకెళ్తూ సుశాంత్‌ కనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణను త్వరలో పునఃప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఏఎన్నాఆర్‌ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా జ్ఞప్తికొస్తున్నాయి. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం కృతజ్ఞుడినై ఉంటాను’ అంటూ సుశాంత్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అలాగే సినిమా గురించి చెబుతూ ‘మార్చి పోయి సెప్టెంబర్‌ వచ్చింది. గేర్‌ మార్చి బండి తియ్‌' అంటూ వ్యాఖ్యానించారు.  వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌. 


logo