గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 13:58:12

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను బోర్డ్‌పై రాసుకున్న సుశాంత్

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను బోర్డ్‌పై రాసుకున్న సుశాంత్

బాలీవుడ్‌లో ఎవ‌రి సపోర్ట్ లేకుండా మంచి హీరోగా నిల‌దొక్కుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అర్ధాంత‌రంగా త‌నువు చాలించ‌డం అంద‌రిని కంటత‌డి పెట్టిస్తుంది. ఆయ‌న మ‌ర‌ణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కొందరి వేధింపులే సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మంటూ వినిపిస్తున్న వాద‌న‌ల‌లో నిజం లేక‌పోలేద‌ని కొన్ని విష‌యాల‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది.  సుశాంత్ బోర్డ్‌పై రాసుకున్న భ‌విష్య‌త్ ప్రణాళిక‌ని సుశాంత్ సోద‌రి శ్వేత త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. 

జూన్ 29 నుండి ఏంఏం చేయాలి అనే దాని గురించి సుశాంత్ ఓ బోర్డ్‌పై రాసి పెట్టుకున్నాడు. త్వ‌ర‌గా నిద్ర లేవాలి, పుస్త‌కాలు చ‌ద‌వాలి, వెబ్ సిరీస్‌లు చూడాలి, గిటార్ నేర్చుకోవాలి, వ‌ర్కవుట్స్ చేయాలి, మెడిటేష‌న్ చేయాలి ఇలా పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు సుశాంత్‌. ఈ లిస్ట్ ఫోటోని సుశాంత్ సోద‌రి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సుశాంత్ వైట్ బోర్డ్  జూన్ 29 నుండి  ప్రతిరోజూ తన వ్యాయామం మరియు అతీంద్రియ ధ్యానాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అతను ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు అని కామెంట్ పెట్టింది. అయితే భ‌విష్య‌త్‌కి సంబంధించి ఇంత ప్ర‌ణాళిక‌లు వేసుకున్న సుశాంత్ జూన్ 14న ఎందుకు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు అనేది మిస్ట‌రీగా మారింది లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo