బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 14:13:23

ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా సుశాంత్ సోద‌రి ఎమోష‌న‌ల్ పోస్ట్

ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా సుశాంత్ సోద‌రి ఎమోష‌న‌ల్ పోస్ట్

సోద‌ర‌సోద‌రీమ‌ణుల ప్రేమ బంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షా బంధ‌న్ వేడుక‌ని దేశ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ప్ర‌తి ఏడాది త‌న త‌మ్ముడికి విషెస్ చెప్పి అత‌ని నుండి స‌ర్‌ప్రైజ్ పొందే సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ ఈ ఏడాది రాఖీకి త‌న త‌మ్ముడు లేక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతుంది. ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌లో చిన్న‌ప్పుడు రాఖీ పండుగ‌కి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసింది.

హ్యాపీ ర‌క్షా బంధన్ నా ప్రియ‌మైన సోద‌రుడా..నిన్ను ఎప్ప‌టికీ ప్రేమిస్తుంటాం జాన్..ఎల్ల‌ప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్ప‌టికి మాకు గ‌ర్వ కార‌ణ‌మే అంటూ ట్వీట్ చేసింది శ్వేతా సింగ్.  మరో సోదరి నీతూ సింగ్ కూడా సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అయితే త‌న త‌మ్ముడు చ‌నిపోవ‌డానికి గ‌ల కార‌కుల‌ని వ‌దిలి పెట్టొందంటూ, ఈ కేసులో లోతుగా ద‌ర్యాప్తు చేయాల‌ని శ్వేతా రీసెంట్‌గా ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే 


logo