గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 18:50:43

సుశాంత్ ప్ర‌తీసారి భ‌య‌ప‌డుతున్న‌ట్టు చెప్పాడ‌ట‌..!

సుశాంత్ ప్ర‌తీసారి భ‌య‌ప‌డుతున్న‌ట్టు చెప్పాడ‌ట‌..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతి కేసును సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, డ్ర‌గ్స్ లింక్ తోపాటు ప‌లు కోణాల్లో ద‌ర్యాప్తు సాగుతోంది. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నవంబ‌ర్ 2019లో ముంబై ఆస్ప‌త్రిలో చేరాడ‌ట‌. అయితే ఆ త‌ర్వాత ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సుశాంత్ ను తిరిగి ఆస్ప‌త్రిలో చేరాల‌ని డాక్ట‌ర్ సూచించ‌గా..సుశాంత్ మాత్రం ఆస్ప‌త్రికి రాకుండా చండీగ‌ఢ్ లోని త‌న సోద‌రి ఇంటికి వెళ్లాల‌నుకున్నాడని సుశాంత్ ను ప‌రీక్షించిన సైక్రియాట్రిస్ట్ లో ఒక‌రు సీబీఐ ద‌ర్యాప్తులో చెప్పారు.

గతేడాది న‌వంబ‌ర్ 25న సుశాంత్ మేనేజ‌ర్ శృతి మోదీ నుంచి నాకు ఫోన్ వ‌చ్చింది. సుశాంత్ ఫోన్ నుంచే ఆ కాల్ చేసి..చికిత్స‌నందించేందుకు సుశాంత్ ద‌గ్గ‌ర‌కు రావాల‌ని అడిగింది. అయితే అదే రోజు రాత్రి సుశాంత్ తో మీటింగ్ ను శృతి మోదీ ర‌ద్దు చేసింద‌ని డాక్ట‌ర్ ముంబై పోలీసుల‌కు చెప్పారు. 27-11-2019న శృతి మోదీ నాకు వాట్సాప్ లో అపాయింట్ మెంట్ కోసం ఒంట‌రిగా ఆస్ప‌త్రికి వ‌చ్చి న‌న్ను క‌లిసింది. ఒక‌సారి సుశాంత్ కు చెక‌ప్ చేయాల‌ని, ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే అత‌న్ని ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేస్తాన‌ని శృతి మోదీ చెప్పింది.

నేను హిందూజా హెల్త్ కేర్ ఆస్ప‌త్రికి సుశాంత్ ను రెఫ‌ర్ చేశాను. ఆ త‌ర్వాత మ‌రుస‌టి రోజు న‌వంబ‌ర్ 28న ఆస్ప‌త్రికెళ్లి సుశాంత్‌ను ప‌రామ‌ర్శించాను. త‌న‌కు నిద్ర రావ‌డం లేద‌ని, జీవితంలో ఏదీ న‌చ్చ‌డం లేద‌ని సుశాంత్ నాతో అన్నాడు. త‌నకిక జీవించాల‌ని లేదంటూ ప్ర‌తీసారి భ‌య‌ప‌డుతూ క‌నిపించాడ‌ని స‌ద‌రు డాక్ట‌ర్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. సుశాంత్ డిప్రెష‌న్, యాంగ్జైటీతో బాధ‌ప‌డుతున్నాడ‌ని నిర్దారించిన‌ట్టు చెప్పాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.