శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 21:24:33

సుశాంత్‌ సోదరి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు డిలీట్‌!

సుశాంత్‌ సోదరి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు డిలీట్‌!

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతా సింగ్‌ కీర్తి సామాజిక మాధ్యమాలకు చెందిన ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు కనిపించకుండా పోయాయి. జూన్‌ 14న అనుమానాస్పదంగా మరణించిన సుశాంత్‌కు న్యాయం జరుగాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె ప్రచారం చేపట్టారు. తన సోదరుడి మరణం వెనుక ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కటుంబ సభ్యుల పాత్ర ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. అయితే సుశాంత్‌ది ఆత్మహత్యేనని కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యుల బృందం ఇటీవల నివేదిక సమర్పించింది. ఈ తరుణంలో సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ కీర్తికి చెందిన ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు డీయాక్టివేట్‌ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఖాతాలను ఆమె తొలగించారా లేదా ఆయా సంస్థలు స్తంభింపజేశాయా అన్నది తెలియడం లేదు. తన సామాజిక ఖాతాలను నిలిపివేస్తున్న విషయాన్ని శ్వేతా సింగ్‌ కీర్తి స్వయంగా వెల్లడించకపోవడంతో ఆమె ఫాలోవర్లు గందరగోళానికి గురవుతున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo