మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 00:55:03

కృతిసనన్‌తో డేటింగ్‌!

కృతిసనన్‌తో డేటింగ్‌!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద ఆత్మహత్మ మరణం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సుశాంత్‌ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కథానాయిక కృతిసనన్‌ ఒకానొక సమయంలో సుశాంత్‌తో డేటింగ్‌లో ఉన్నారని నటి లిజా మాలిక్‌ వెల్లడించారు. ఓ ఆంగ్లపత్రికతో ఆమె మాట్లాడుతూ ‘దాదాపు రెండు సంవత్సరాల క్రితం కృతిసనన్‌ పుట్టినరోజు వేడుకలో సుశాంత్‌ని కలిశాను. ముంబయ్‌లోని బాంద్ర క్లబ్‌లో జరిగిన ఈ పార్టీలో సుశాంత్‌ ఎంతో సంతోషంగా కనిపించాడు. ఆ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ నవ్వుతూ పలకరించాడు. కృతిసనన్‌తో పాటు సుశాంత్‌ కూడా అందరిని రిసీవ్‌ చేసుకుంటూ డ్రింక్స్‌ అందిస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ ఆనందంగా వున్నాడు. ఆరోజు కృతి-సుశాంత్‌ ముఖాల్లో కొత్త వెలుగు కనిపించింది.వాళ్లిద్దరిని అలా చూస్తే రిలేషన్‌లో వున్నారని నాకు అనిపించింది. ఈ ఇద్దరు డేటింగ్‌లో వున్నారని పలు మాధ్యమాల్లో వచ్చినప్పటికీ ఎన్నో సార్లు ఇద్దరు కలిసి బయటికి వచ్చేవారు’ అని తెలిపారు లిజా.





logo