బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 12:41:08

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత మారిన కంపెనీ ఐపీ అడ్రెస్‌..!

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత మారిన కంపెనీ ఐపీ అడ్రెస్‌..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత అనేక విష‌యాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఖాతా నుండి చాలా సొమ్ము అజ్ఞాత‌వ్యక్తుల‌కి బ‌దిలీ అయింద‌ని తెలియ‌డంతో సుశాంత్ తండ్రి బీహార్ పోలీసుల‌కి ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం మ‌నీ ల్యాండ‌రింగ్ విష‌యంలో సుశాంత్ గార్ల్‌ఫ్రెండ్ రియాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ని ఈడీ విచారిస్తున్న విష‌యం తెలిసిందే

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, రియా చ‌క్ర‌వ‌ర్తి ఓ సంస్థ‌లో డైరెక్ట‌ర్స్‌గా ఉన్న విష‌యం విదిత‌మే. అయితే సుశాంత్ మ‌ర‌ణించిన త‌ర్వాత కంపెనీ ఐపీ అడ్రెస్‌, డొమైన్ పేరు మార్చ‌బ‌డింద‌నే విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. జూన్ 23న ఐపీ అడ్రెస్‌, డొమైన్ పేరు మొద‌టి సారిగా మార్చ‌బ‌డింద‌ని, ఆ త‌ర్వాత ఆగ‌స్ట్ 7న మ‌రోసారి మార్పు జ‌రిగింద‌ని టైమ్స్ నౌ మీడియా చెబుతుంది. మ‌రి ఐపీ అడ్రెస్, డొమైన్  మార్చ‌డానిక గ‌ల కార‌ణాలంటి అనేది తెలియాల్సి ఉంది. 


logo