ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 17:19:54

సుశాంత్-సంజనా 'దిల్ బెచారా' ట్రైలర్

సుశాంత్-సంజనా 'దిల్ బెచారా' ట్రైలర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ముఖేశ్ చాబ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కాన్సర్ తో పోరాడుతున్న కిజ్జీ (సంజనా సంఘి)అనే యువతి జీవితంలోకి  మన్నీ (సుశాంత్ పాత్ర)వస్తాడు. మన్నీతో కొత్త ఆశలు చిగురించిన కిజ్జీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మన్నీ-కిజ్జీ మధ్య ప్రేమ, బావోద్వేగ సన్నివేశాలతో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

సుశాంత్ సింగ్ ఈ చిత్రంలో తన నటనతో మరోసారి అభిమానుల కంట కన్నీరు తెప్పించేలా ఉంది. జులై 24న డిస్నీ, హాట్ స్టార్ లో ఈ చిత్రం విడుదల కానుంది.  సంజనా సంఘి ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతుంది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo