శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 30, 2020 , 20:39:09

రియా ద్వారా సుశాంత్ కు మందులు: సుశాంత్ ట్రైన‌ర్ స‌మీ

రియా ద్వారా సుశాంత్ కు మందులు: సుశాంత్ ట్రైన‌ర్ స‌మీ

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి అత‌ని ట్రైన‌ర్ స‌మీ అహ్మ‌ద్ కొన్ని విష‌యాలు షేర్ చేసుకున్నాడు. రియా చ‌క‌వ్ర‌ర్తితో ఫ్రెండ్ షిప్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి సుశాంత్ సింగ్ డిఫ‌రెంట్ గా క‌నిపించాడ‌ని స‌మీ అహ్మ‌ద్  రిప‌బ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. నేను జూన్ 1న సుశాంత్ తో మాట్లాడాను. మా అమ్మ చ‌నిపోయింద‌ని తెలుసుకుని సుశాంత్ నాకు ఫోన్ చేశాడు. అమ్మ గురించి అడిగి తెలుసుకున్నాడు. మా నాన్న‌ను మంచిగా చూసుకోవాలని సుశాంత్ నాతో చెప్పేవాడు. ఏమైనా అవ‌స‌ర‌మైతే త‌న‌కు చెప్పాల‌ని, ఇంటికి ర‌మ్మ‌ని చెప్పేవాడు. నాకు, అమ్మ‌కు సుశాంత్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. కానీ రెండు వారాల్లోనే సుశాంత్ ఆత్మ‌హ‌త్య వార్త విన్నాక షాక్ అయ్యామ‌ని స‌మీ అహ్మ‌ద్ అన్నాడు. 

ఒక‌వేళ సుశాంత్  డిప్రెష‌న్ లో ఉంటే రియా సూచించిన డాక్ట‌ర్.. సుశాంత్ కు మెడికేష‌న్ (మందులివ్వ‌డం)కంటే ముందు కౌన్సెలింగ్ సెష‌న్ ఇప్పించాల్సింది. కౌన్సెలింగ్ థెర‌పీ కూడా ఇవ్వాల్సింది.. ఒక‌వేళ డాక్టర్ కు ఆ విష‌యం తెలియ‌క‌పోతే..డిప్రెష‌న్ ను ఎలా దూరం చేయాలో కూడా తెలియ‌దు. అప్పుడు ఆ డాక్టర్ సుశాంత్ కు ఎలా మందులు రాస్తాడ‌ని స‌మీ అహ్మ‌ద్ అనుమానం వ్య‌క్తం చేశాడు.  రియా ద్వారా సుశాంత్ కు డాక్ట‌ర్ మందులు ఇచ్చాడ‌ని స‌మీ అహ్మాద్ ఆరోపించారు. స‌మీ అహ్మ‌ద్ చెప్పిన విష‌యాలు మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. 

మ‌రి రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్ ను డిప్రెష‌న్ నుంచి దూరం చేసేందుకు ప్ర‌య‌త్నించిందా.? లేదా సుశాంత్ ను మ‌రింత ఒత్తిడికి లోన‌య్యేట‌ట్టు చేసిందా ? అనేది విచార‌ణ‌లో తేల‌నుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo