మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 16:21:45

సుశాంత్‌ తండ్రి ఇంకా షాక్‌లోనే ఉన్నారు: శేఖర్‌సుమన్‌

సుశాంత్‌ తండ్రి ఇంకా షాక్‌లోనే ఉన్నారు: శేఖర్‌సుమన్‌

పాట్నా: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ తండ్రి కేకే సింగ్‌ను బాలీవుడ్‌ నటుడు శేఖర్‌ సుమన్‌  పరామర్శించారు. సుశాంత్‌ తండ్రిని పరామర్శించి..నా ప్రగాఢ సంతాపం తెలియజేశాను. ఇద్దరం కూర్చొని కొద్దిసేపు పలు విషయాలు మాట్లాడాం. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండి..సుశాంత్‌ ఫ్యామిలీకి సానుభూతి తెలియజేయాలనుకున్నా. అని ట్వీట్‌ చేశారు. #justiceforSushantforum #CBIEnquiryForSushant హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించారు. 

సోషల్‌మీడియా ద్వారా జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ ఫోరమ్‌ క్యాంపెయిన్‌ ను ప్రారంభించినట్లు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సుశాంత్‌ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. సుశాంత్‌ మృతి వెనుక కంటికి కనిపించే దాని కంటే ఎక్కువే కారణాలుండవచ్చని శేఖర్‌ సుమన్‌ అభిప్రాయపడ్డారు. logo