గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 15:29:32

త‌న‌ని ఖ‌తం చేస్తార‌ని ముందే చెప్పాడు: సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్

త‌న‌ని ఖ‌తం చేస్తార‌ని ముందే చెప్పాడు: సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్

సుశాంత్ మ‌ర‌ణం గురించి అనేక విష‌యాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇటు మీడియా అటు పోలీసులు.. సుశాంత్ స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ ఇలా ప‌లువురుని విచారిస్తున్న క్ర‌మంలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ ప్రముఖ నేషనల్ టీవీ ఛానల్ జరిపిన చ‌ర్చ‌లో సుశాంత్‌కి సంబంధించిన అనేక విష‌యాలు వెల్ల‌డించింది.

ఇండస్ట్రీలోని కొందరు సుశాంత్ ని వేధిస్తున్నారని తన సోదరికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసేవాడు. వారినికి ఒక్క‌సారైన మేం గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడేవాళ్ళం. డిప్రెష‌న్ ఉండేది కాదు కాని ఏదో ఆందోళ‌న‌తో మాట్లాడుతున్న‌ట్టు క‌నిపించేవాడు.  జూన్ 9న త‌న మేనేజ‌ర్ దిశా స‌లియాన్ మ‌ర‌ణించిన త‌ర్వాత సుశాంత్ చాలా కుంగిపోయాడు. ఓ ర‌క‌మైన భ‌యాందోళ‌న‌కి గుర‌య్యాడు.  దిశానే కాదు.. నన్ను కూడా వదలరు. నన్ను కూడా ఖతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని దిశా చనిపోయిన తర్వాత సుశాంత్ తన సోదరి మితూతో భ‌య‌ప‌డుతూ మాట్లాడాడు అని స్మిత పేర్కొంది. ఆయ‌న డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డ‌లేదు. బై పోలార్ డిజార్డ‌ర్ కూడా లేదు. 

చ‌నిపోయే మూడు రోజుల ముందు సినిమాలు మానేసి వ్య‌వ‌సాయం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు నాకు చెప్పాడు. కాని అంతలోనే ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకొని మ‌ర‌ణించడం బాధ‌గా ఉంది. నవంబ‌ర్‌లో సుశాంత్‌ని క‌లిసిన‌ప్పుడు ఏదో బాధ‌లొ ఉన్న‌ట్టు క‌నిపించాడు. తాను ఎవ‌రివ‌ల‌న వేధించ‌బ‌డుతున్నాడ‌నే విష‌యం గురించి ఎక్క‌డా నోరు విప్ప‌లేదు అంటూ స్మితా పారిఖ్ పేర్కొన్నారు. అయితే సుశాంత్ మ‌ర‌ణించ‌డానికి ముందు ఆయ‌న ఇంట్లో పార్టీ జ‌రిగింద‌ని, ఆ పార్టీలో పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ని ఓ వ‌ర్గం చెబుతుండ‌గా, అలాంటిదేమి లేద‌ని సుశాంత్ వంట మ‌నిషి చెబుతుండ‌డం ప‌లు అనుమానాల‌కి తావిస్తుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo