శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 13:02:48

సుశాంత్‌, రియా క‌లిసి డ్రగ్స్‌ తీసుకునేవారు..

సుశాంత్‌, రియా క‌లిసి డ్రగ్స్‌ తీసుకునేవారు..

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ద‌ర్యాప్తు చేప‌డుతున్న సీబీఐ అధికారులకు కొన్ని షాకింగ్ విష‌యాలు తెలుస్తున్నాయి.  దివంగ‌త న‌టుడు సుశాంత్ మారిజునా మాద‌క ద్ర‌వ్యాన్ని తీసుకునేవాడు అని అత‌ని మేనేజ‌ర్ శ్రుతి మోదీ తెలిపారు.  గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి మారిజోనా డ్ర‌గ్స్‌ను తీసుకునేవారిని శ్రుతి సీబీఐకి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ శామ్యూల్ మిరండా, సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తి కూడా కొన్ని సంద‌ర్భాల్లో క‌లిసి డ్ర‌గ్స్ సేవించేవార‌ని విచార‌ణ‌లో వెల్ల‌డైంది.  అయితే  డ్ర‌గ్స్ తీసుకోవ‌డం లేద‌ని గతంలో రియా పేర్కొన్న విష‌యం తెలిసిందే.  

సుశాంత్ మృతి కేసులో బీమా సంబంధిత అంశాలు ఏమీ లేవ‌ని ఫ్యామిలీ త‌ర‌పున వాదిస్తున్న లాయ‌ర్ వికాశ్ సింగ్ మీడియాతో తెలిపారు. సుశాంత్ సూసైడ్ చేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ డ‌బ్బులు రావ‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. కానీ సుశాంత్‌కు ఎటువంటి జీవిత బీమా లేద‌ని లాయ‌ర్ వికాశ్ స్ప‌ష్టం చేశారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైపోలార్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డేవాడ‌ని ముంబై పోలీసుల‌తో డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 13 ఏళ్ల నుంచి సుశాంత్ మానసిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌ట్లు చెప్పారు. అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్‌యాక్టివిటీ డిజార్డ‌ర్‌(ఏడీహెచ్‌డీ)తో సుశాంత్ బాధ‌ప‌డిన‌ట్లు డాక్ట‌ర్లు చెబుతున్నారు. సుశాంత్‌కు న్యాయం చేయాలంటూ అమెరికాలో పెట్టిన బిల్‌బోర్డుల‌ను తొల‌గిస్తున్నారు.

 logo