తమిళ అగ్ర కథానాయకుడు సూర్య శుక్రవారం జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘జై భీమ్’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అణగారిన వర్గాల హక్కులు, వారి భూపోరాటాలకు అండగా నిలిచే న్యాయవాదిగా ఆయన పాత్ర చిత్రణ సామాజిక స్పృహతో సాగుతుందని చెబుతున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజీషా విజయన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కథీర్, సంగీతం: సేన్రోల్డన్, దర్శకత్వం: టీజే జ్ఞానవేల్.