శనివారం 30 మే 2020
Cinema - Apr 28, 2020 , 20:52:40

శానిటైజ‌ర్లు అంద‌జేసిన నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

శానిటైజ‌ర్లు అంద‌జేసిన నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ ‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలని ప్ర‌ముఖ‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్ర‌జ‌ల‌ను కోరారు. నిర్మాత నాగ‌వంశీ ఇవాళ సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ కు హ్యాండ్ శానిటైజ‌ర్లు, ఫేస్ మాస్కుల‌ను అంద‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..మా చిత్ర నిర్మాణ సంస్థలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్  సంయుక్తంగా ఇవాళ సైబరాబాద్ పోలీస్ కమీషనర్  వి.సి. సజ్జనార్ కు హ్యాండ్ శానిటైజ‌ర్లు, ఫేస్ మాస్కుల‌ను  అంద‌జేశామ‌న్నారు. కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కీర్తించద‌‌గిన‌వ‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవని కొనియాడారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి.., క్షేమంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo