బుధవారం 27 మే 2020
Cinema - May 17, 2020 , 16:20:44

అప్పు వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న సూర్య‌

అప్పు వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న సూర్య‌

క‌రోనా క్రైసిస్ వ‌ల‌న ప్ర‌పంచం అస్త‌వ్య‌స్తం అయింది. ప‌లు రంగాల‌లో అనేక మార్పులు వ‌స్తున్నాయి. సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే ఇంత‌క‌ముందు థియేట‌ర్స్‌లో రిలీజ్ కావ‌ల‌సిన చాలా చిత్రాలు ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నాయి. త‌మిళ హీరో సూర్య తాను నిర్మించిన పొన్ మగళ్ వందాల్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే

సూర్య ప్ర‌క‌ట‌న‌తో  థియేటర్ల ఓనర్లు భగ్గుమన్నారు. సూర్య నటించిన సినిమాలను బాయ్ కాట్ చేస్తామని, థియేటర్లలో రిలీజ్ చేయనివ్వమని హెచ్చరించారు. అయితే సూర్య మాత్రం తాను అనునకున్నట్లే పోన్ మగళ్ వందాల్ సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తానని ప్రకటించారు. తనకు 70 కోట్ల అప్పు ఉందని, సినిమాను విడుదల చేసుకోకుండా ఇంకేం చేయాలనీ ప్రశ్నించాడు. సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు ఎవ‌రైన అండ‌గా ఉన్నారా?   సినిమా హిట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో కూడా ఎగొట్టే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నన్ను ప్రశ్నించడం కామెడీగా ఉంది. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలను ఇకపై ఓటిటిలోనే విడుదల చేస్తాను. అందుకు త‌గ్గ‌ట్టే బ‌డ్జెట్ కూడా ఉంటుంద‌ని సూర్య కామెంట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.


logo