కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓటీటీ సినిమా జై భీమ్తోపాటు పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్ (Vetrimaaran) తో మరో సినిమా చేస్తున్నాడు. అయితే సీరియస్ ట్రాక్ తో సాగే సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంటున్నాడట సూర్య. తాజాగా ఈ స్టార్ హీరోకు సంబంధించిన కొత్త వార్త తెరపైకి వచ్చింది. భారీ బడ్జెట్ తో రాబోయే కమర్షియల్ ఎంటర్ టైనర్ కు సూర్య సంతకం చేసినట్టు సూర్య సంతకం చేసినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్.
రజినీకాంత్ తో అన్నాత్తే సినిమా చేస్తున్న శివ (Siva)ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రంలో సూర్య మాస్ అవతారంలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత సూర్య నుంచి మాస్ మసాలా ఎంటర్ టైనర్ వస్తుందన్న అప్ డేట్ తో పండుగ చేసుకుంటున్నారు అభిమానులు.
దసరా సందర్బంగా ఈ సినిమాను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలై 2022 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని తాజా సమాచారం.
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ