గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 16, 2020 , 10:19:54

హిందీలో రీమేక్ కానున్న ‌ఆకాశం నీ హ‌ద్దురా..!

హిందీలో రీమేక్ కానున్న ‌ఆకాశం నీ హ‌ద్దురా..!

చాలా రోజుల త‌ర్వాత సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.  సుధాకొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శూర‌రై పోట్రు చిత్రంలో సూర్య న‌టించ‌గా, ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ కూడా మూవీని ఆకాశానికి ఎత్తారు. ఇదొక రోల‌ర్ కోస్ట‌ర్ అన్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించిన శూర‌రై పోట్రు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. 

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా సౌత్ రీమేక్‌ల‌పై ఆధార ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాల‌ని రీమేక్ చేసిన షాహిద్ ఇప్పుడు శూర‌రై పోట్రు చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్ ఉంది. షాహిద్ ప్ర‌స్తుతం జెర్సీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ సినిమా షూటింగ్‌ని ఇటీవ‌ల తిరిగి మొద‌లు పెట్టాడు.


logo