బుధవారం 27 మే 2020
Cinema - Apr 26, 2020 , 07:53:08

సూర్య సినిమాలు విడుద‌ల కానివ్వం..!

సూర్య సినిమాలు విడుద‌ల కానివ్వం..!

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా రిలీజ్ కావ‌ల‌సిన చాలా సినిమాలు వాయిదా ప‌డ్డాయి. మ‌ళ్ళీ థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో కొన్ని సినిమాల‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. ఇప్ప‌టికే తెలుగులో అమృత‌రామ‌మ్ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. ఇక జ్యోతిక ప్రధాన పాత్రలో హీరో సూర్య నిర్మించిన చిత్రం ‘పొన్మగల్ వంధాల్’ చిత్రాన్ని నేరుగా అమేజాన్ ప్రైమ్‌ లోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ఇప్ప‌టికే అమేజాన్ ప్రైమ్‌తో సూర్య ఒప్పందం చేసుకున్నాడ‌న్న విష‌యం తెలుసుకున్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రతినిధులు దీనిని ఖండిస్తున్నారు. సినిమాల‌ని థియ‌టేర్స్ దృష్టిలో ఉంచుకొనే తెర‌కెక్కిస్తారు. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాల‌ని డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే  థియేటర్స్ మనుగడకు ముప్పు వస్తుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. సూర్య త‌మ నిర్ణ‌యం మార్చుకోక‌పోతే  సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తాం. ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వమని థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. 


logo