శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 19:31:38

సురేష్ ప్రొడక్షన్స్ మరో రీమేక్..నాగ‌చైత‌న్య‌కు సురేష్ మామ గిఫ్ట్..?

సురేష్ ప్రొడక్షన్స్ మరో రీమేక్..నాగ‌చైత‌న్య‌కు సురేష్ మామ గిఫ్ట్..?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ సినిమాల హవా స్పష్టంగా కనిపిస్తుంది. పక్క ఇండస్ట్రీలలో కూడా పక్క దేశాల్లో వచ్చిన సినిమాలను కూడా మన దగ్గరికి తీసుకొస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా కొరియన్ సినిమాలను కూడా మన ఇండస్ట్రీకి తగ్గట్లు మార్చి ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందుంటుంది. తాజాగా మరో రీమేక్ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్. కొరియాలో విజయం సాధించిన లక్కీ కీ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు ప్రకటించారు సురేష్ ప్రొడక్షన్స్. లక్కీ కీ సినిమా జపనీస్‌లో వచ్చిన కీ ఆఫ్ లైఫ్ నుంచి తెరకెక్కించారు. ఈ సినిమాను ఇప్పుడు ఇండియాకు తీసుకొస్తున్నారు. 

కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఉన్న లక్కీ కీ సినిమాను తెలుగులో ఓ ప్రముఖ నటుడితో పాటు దర్శకుడితో చేయబోతున్నామని చెప్పారు. అయితే ఆ ప్రముఖ నటుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగ చైతన్య ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్యతో వెంకీ మామ సినిమాను నిర్మించిన సురేష్ మామ.. ఇప్పుడు మరో గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo