గురువారం 28 మే 2020
Cinema - May 13, 2020 , 14:08:13

రానా పెళ్లి పనుల‌పై సురేష్ బాబు కామెంట్స్..!

రానా పెళ్లి పనుల‌పై సురేష్ బాబు కామెంట్స్..!

మంగ‌ళ‌వారం రోజు రానా త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఎవ‌రు ఊహించని షాక్ ఇచ్చాడు. హైద‌రాబాద్‌కి చెందిన మిహీకా బ‌జాజ్‌ని త్వ‌ర‌లో వివాహ‌మాడ‌బోతున్న‌ట్టు ప‌రోక్షంగా ప్ర‌క‌టించాడు. దీంతో అభిమానులతో పాటు కొంద‌రు కుటుంబ స‌భ్యులు కూడా షాక్ అయిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న రానా ఓ ఇంటి వాడు కాబోతున్నాడ‌నే వార్త వినే స‌రికి ఇటు అభిమానులు, అటు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు వెల్లువ కురిపించారు.

తాజాగా రానా తండ్రి సురేష్ బాబు ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. పిల్లలు ఇద్ద‌రు చాలా కాలం నుండి ఒక‌రినొక‌రు తెలుసుకున్నారు. వారి వ‌ల‌న మేము సంతోషంగా ఉన్నాము. డిసెంబ‌ర్‌లో వారి పెళ్ళి జ‌ర‌పాల‌ని భావిస్తున్నాము. ప‌రిస్థితులు అనుకూలిస్తే కొంచెం త్వ‌ర‌గా కూడా జ‌రిపే అవ‌కాశం ఉంది. ఒక్క‌సారి క్లారిటీ వ‌స్తే అన్ని వివ‌రాల‌ని మీకు తెలియ‌జేస్తాము. ప్రస్తుతం మేము వెడ్డింగ్ ప్లానింగ్స్‌లో బిజీగా ఉన్నాం అని సురేష్ బాబు స్ప‌ష్టం చేశారు 


logo