e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఓటిటి వల్ల భారీ నష్టం అంటున్న సీనియర్ నిర్మాత

ఓటిటి వల్ల భారీ నష్టం అంటున్న సీనియర్ నిర్మాత

ఓటిటి వల్ల భారీ నష్టం అంటున్న సీనియర్ నిర్మాత

ఓటిటి..ఈ పదం రెండేళ్ల కింద ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఊతపదం అయిపోయింది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. కొన్ని పెద్ద సినిమాలు కూడా అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రాధే కూడా నేరుగా ఆన్ లైన్ లో విడుదలైంది. రాబోయే కాలంలో కూడా చాలా సినిమాలు ఇలాగే విడుదల అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఓటీటీ సంస్థపై సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాలు బతకాలంటే థియేటర్లు ఉండాలని ఒకప్పుడు ఈయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.

విడుదలైన నెల రోజులకే ఓటీటిలో సినిమాలు వచ్చేస్తే..థియేటర్లకు ఎవరు వస్తారు అంటూ గత కొన్ని నెలలుగా ఆయన తన వాదన వినిపిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓటిటి వ్యవస్థపై సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈయన కేవలం నిర్మాత మాత్రమే కాదు..ఎగ్జిబిటర్ కూడా. థియేటర్ కష్టాలు కానీ, లాభాలు కానీ ఆయనకు బాగా తెలుసు. దానికి తోడు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు.. ఎలాంటి సినిమాలు చూడడానికి వస్తారు అని క్లారిటీ కూడా ఈయనకు ఉంది. ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ తన కుటుంబంతో పాటు సినిమాకు వెళ్లాలంటే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో చాలామంది థియేటర్ల వైపు చూడటం మానేశారు హాయిగా ఓటిటిలో ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూస్తున్నారు.

ఇలా సినిమాలు నేరుగా విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా థియేటర్లపై ప్రభావం భారీగానే పడుతుంది అంటున్నారు సురేష్ బాబు. కానీ నిర్మాతలకు ఇప్పుడు మరో ఆప్షన్ కూడా లేదు. అది వాళ్ల వాళ్ల ఇష్టం అని చెబుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది థియేటర్లకి రావడం కంటే టీవీతో పాటు మొబైల్ లో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా పెద్ద పెద్ద నగరాల్లో వీకెండ్స్ థియేటర్లకు రావటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని.. బడ్జెట్ అదుపులో ఉంచుకొని స్టాండర్డ్ సినిమాలు తీయాలని దర్శకులను కోరుతున్నాడు సురేష్ బాబు.

అలా చేయకపోతే కచ్చితంగా థియేటర్ వ్యవస్థపై భారీ ప్రభావం పడటం ఖాయం అంటున్నాడు. ఇంత తెలిసిన మీరు ఎందుకు ఓటిటీ వైపు వెళ్లడం లేదు అంటే.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటివాళ్ళు కూడా నష్టాల్లోనే తమ సంస్థలను నడుపుతున్నారు. అందుకే తాను అటువైపు వెళ్లడం లేదు అంటూ సమాధానం చెప్పారు సురేష్ బాబు.

ఇవి కూడా చదవండి..

అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మ‌న‌సులో మాట

ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా విద్యాబాల‌న్‌.. షేర్నీ ట్రైల‌ర్ రిలీజ్‌

ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చ‌క్క‌ర్లు

వ‌కీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైర‌ల్‌

టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!

లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు

అభిమానుల‌కు మాధ‌వ‌న్ విజ్ఞ‌ప్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓటిటి వల్ల భారీ నష్టం అంటున్న సీనియర్ నిర్మాత

ట్రెండింగ్‌

Advertisement