సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 17:30:02

'కంగ‌నా' చిత్రంతో చీర‌..వ‌స్త్ర వ్యాపారి మ‌ద్ద‌తు..వీడియో

'కంగ‌నా' చిత్రంతో చీర‌..వ‌స్త్ర వ్యాపారి మ‌ద్ద‌తు..వీడియో

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి త‌ర్వాత బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప‌లువురిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముంబై-పీవోకే వ్యాఖ్య‌ల‌తో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కంగ‌నార‌నౌత్ ఆఫీసును కూల్చేసింది. ప్ర‌భుత్వం చేస్తున్న దౌర్జ‌న్యంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింతి కంగ‌నా. ప‌లువురు సెల‌బ్రిటీలు కంగ‌నాకు మ‌ద్ద‌తుగా నిలిచారు. తాజాగా సూర‌త్ కు చెందిన వ‌స్త్రవ్యాపారి కంగ‌నా ర‌నౌత్ కు మ‌ద్ద‌తు ప‌లికాడు.

వ‌స్త్ర‌వ్యాపారి రజ‌త్ ద‌వేర్ మాట్లాడుతూ..కొన్ని అంశాల‌పై కంగ‌నా త‌న వాయిస్ వినిపిస్తున్నారు. కానీ ప్ర‌భుత్వం ఆమె గొంతు నొక్కేస్తూ..కంగ‌నా ఆఫీసును కూల్చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కంగనాకు తెలిపేందుకు..ఆమె చిత్రంతో ఉన్న చీర‌ను ఆవిష్క‌రించాం. ఈ విష‌యం తెలుసుకున్న చాలా మంది చీర‌ల‌ను ఆర్డ‌ర్ చేసుకున్నారు. చీర ప్రారంభ‌ర ధ‌ర రూ.1000 గా నిర్ణ‌యించిన‌ట్టు ర‌జ‌త్ ద‌వేర్ తెలిపాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo