గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Jul 30, 2020 , 15:13:32

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు.. పిల్‌ను తిర‌స్క‌రించిన సుప్రీం

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు.. పిల్‌ను తిర‌స్క‌రించిన సుప్రీం

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌పై  అనుమానాలు నెల‌కొన్న నేప‌థ్యంలో.. ఆ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లైంది. అయితే ఆ పిటిష‌న్‌ను ఇవాళ అత్యున్న‌త న్యాయ‌స్థానం కొట్టిపారేసింది.  సుశాంత్ కేసును ముంబై పోలీసులే విచార‌ణ చేయాల‌న్న‌ట్లుగా కోర్టు ఆదేశించింది. అల‌క్ ప్రియా అనే వ్య‌క్తి సుప్రీంలో పిల్ వేశారు.  అయితే ఈ కేసులో ముంబై కోర్టును ఆశ్ర‌యించాల‌ని సుప్రీం ఆ పిటిష‌న‌ర్‌కు సూచించింది. 

సుశాంత్ కేసును బీహార్ పోలీసులు కూడా విచారిస్తున్నారు. ద‌ర్యాప్తు నేప‌థ్యంలో వాళ్లు ముంబై వెళ్లారు. సుశాంత్ సోద‌రి మీటూ సింగ్‌ను బీహార్ పోలీసులు విచారించారు.  సుశాంత్ స్నేహితుడు మ‌హేశ్ కృష్ణ శెట్టిని కూడా వారు విచారించారు.  స్నేహితురాలు రియానే సుశాంత్‌ను త‌న ఆధీనంలో పెట్టుకుంద‌ని మీటూ సింగ్ ఆరోపించారు. సుశాంత్‌కు దెయ్యాల క‌థ‌లు చెబుతూ త‌న ఇంటిని ఖాళీ చేసే విధంగా రియా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు మీటూ సింగ్ పోలీసుల‌కు చెప్పారు.  ముంబైలో ఉన్న సుశాంత్ బ్యాంక్ అకౌంట్ వివ‌రాల‌ను కూడా పోలీసులు సేక‌రిస్తున్నారు. అత‌నికి చికిత్స చేసిన డాక్ట‌ర్ల‌ను కూడా బీహార్ పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.

రియా చ‌క్ర‌వ‌ర్తి తీరు ప‌ట్ల లాయ‌ర్ వికాస్ సింగ్ అనుమానాలు వ్య‌క్తం చేశారు. సుశాంత్ కేసులో తొలుత సీబీఐ విచార‌ణ కోరిన రియా.. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పాట్నాలో న‌మోదు కావ‌డంతో.. సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్ర‌యించిన‌ట్లు లాయ‌ర్ వికాస్ ప్ర‌శ్నించారు. దీనిని బ‌ట్టి ముంబై పోలీసులు రియాకు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతున్న‌ద‌ని లాయ‌ర్ వికాస్ డౌట్ వ్య‌క్తం చేశారు. బీహార్ పోలీసుల చేస్తున్న విచార‌ణ‌ను ముంబైకి బ‌దిలీ చేయాల‌ని ఎందుకు రియా సుప్రీంకు వెళ్లిన‌ట్లు ఆయ‌న ప్ర‌శ్నించారు.  ఒక‌వేళ రియా సుప్రీంకోర్టుకు వెళ్తే, అప్పుడు ఆమె సుశాంత్ కేసులో సీబీఐ విచార‌ణ కోరుతూ డిమాండ్ చేయాలి, కానీ అందుకు భిన్నంగా ఆమె ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు వికాస్ ఆరోపించారు.