శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 21:23:09

రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!

రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!

ఇండియన్ సినిమాలో రజినీకాంత్ సూపర్ స్టార్. కానీ తమిళ ప్రేక్షకులకు మాత్రం ఆయన దేవుడు. ముఖ్యంగా అభిమానులు రజనీకాంత్ ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన ఏం చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కేవలం సినిమాల నుంచి వచ్చిన అభిమానం కాదు. ఆయన వ్యక్తిగత నిర్ణయాలకు కూడా రజనీకాంత్ అభిమానులు అంతే గౌరవం ఇస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసిన తర్వాత అభిమానుల గుండె పగిలిపోతుంది. ఈ మధ్య తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు.. పార్టీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు సూపర్ స్టార్. తన ఆరోగ్య కారణాల రీత్యా ఇప్పుడు ఈ లేనిపోని రిస్కు తీసుకోలేను అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. 

మరోవైపు అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించారు. రాజకీయాలు చేయకపోయినా పర్వాలేదు మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు అని వాళ్లు కోరుకున్నారు. పాలిటిక్స్ చేసినా చేయకపోయినా సినిమాలు మాత్రం చేస్తాడు అని రజనీ అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం చేజారిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రజినీకాంత్ తీసుకున్న నిర్ణయం ఇదే. అర్థం కాలేదు కదా.. రజినీ సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలని ఆలోచిస్తున్నాడు. వినడానికి, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది ఈ వార్త. కానీ సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియాలో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అనారోగ్య కారణాలతో రజినీకాంత్ ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా..ఏమాత్రం మానసిక ఒత్తిడికి లోనైనా కూడా వెంటనే చెడిపోతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. కేవలం ఈ కారణంతోనే రాజకీయాలకు ఆయన పూర్తిగా గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు సినిమాలకు కూడా దూరం కావాలని ఆలోచిస్తున్నాడు. ఒక సినిమాలో నటించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఎంతో కొంత ఒత్తిడి ఖచ్చితంగా భరించాల్సిందే. ఇప్పుడు ఆ కనీస ఒత్తిడి కూడా రజనీకాంత్ శరీరం తీసుకోలేకపోతోందని అంటున్నారు వైద్యులు. అందుకే ఆయన సినిమాలకు దూరంగా ఉండడమే మంచిది అని వాళ్లు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా సూపర్ స్టార్ కు ఇదే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. రజినీకాంత్ కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఇప్పుడు శివ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న అన్నాతై సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. మొన్న ఆయన హైదరాబాదులో హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు మళ్లీ షూటింగ్ వైపు వెళ్ళలేదు. ముందు ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రజినీకాంత్. ఆ తర్వాత మిగిలిన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు సూపర్ స్టార్. 70 ఏళ్ళ రజినీకాంత్ తన 45 ఏళ్ల కెరీర్ లో 160 సినిమాలకు పైగా నటించాడు. ఒకవేళ నిజంగానే రజిని రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ముందే రిలీజ్ కానుందా..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

నితిన్ కోసం ర‌ణ్‌వీర్‌సింగ్ మేక‌ప్ ఆర్టిస్ట్‌..!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo